Site icon vidhaatha

Ktr: కేటీఆర్‌పై మరో కేసు నమోదు

Ktr: విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణం. కేటీఆర్ కు శనివారం ఏసీబీ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఈ కారు రేస్ కేసులో ఆయన విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఎంని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బ తీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని తన ఫిర్యాదులో తెలియజేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీస్ కంప్లైంట్ లో రాసుకొచ్చాడు. సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులో కేటీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

 

 

 

Exit mobile version