Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం సోమవారం, మార్చి 31న వారి వారి పేర్ల మీద రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి : వివాహ ప్రయత్నములను వాయిదా వేయుట మంచిది. వాహన ప్రమాదములకు అవకాశము, మానసికంగా ఆందోళనకు గురయ్యెదరు. యత్నకార్యములకు ఆటంకాలు కలుగుతాయి, ధనవ్యయము కలుగవచ్చును.
వృషభ రాశి : సహచరులను అనుమానించెదరు. శరీరములో తాపమెక్కువగానుండును. ప్రయాణములు అనుకూలించవు. ఆకస్మికంగా కలహము లేర్పడును. భయము వలన ఇబ్బందులు కలుగవచ్చును.
మిథున రాశి : వాక్ చాతుర్యముచే పనులను చక్కబెట్టుదురు, శుభాకార్యమునకై ఆలోచనలు చేయదురు. రావలసిన ధనం చేతికందుతుంది, దైవచింతనతో ఉల్లాసముగా గడిపెదరు.
కర్కాటక రాశి : నిందలను విని ఉద్వేగానికి లోనయ్యెదరు. స్థిరాస్థి విషయములో అశాంతి కలుగవచ్చును. శరీర బాధలతో పనులు సాగవు. ధనవ్యయము ఎక్కువ, భోజన సౌఖ్యము లేకుండుట కలుగవచ్చును.
సింహ రాశి : వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారములకు సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
కన్యా రాశి : ఉద్యోగ మార్పు ప్రయత్నాలు అనుకూలించవు. ఆకస్మిక ధనవ్యయము వుంటుంది. ప్రయాణ మూలక శ్రమ వుంటుంది. పెద్దవారి వద్ద అవమానాలు ఎదురవుతాయి. మానసికంగా చికాకును కలిగి వుంటారు.
తులా రాశి : పుణ్యక్షేత్ర సందర్శనం వుంటుంది. జీవిత భాగస్వామితో సంభాషణలు ధైర్యాన్నిస్తాయి. మీ ఎదుగుదలకు కొంతమందికి కంటగింపుగా వుంటుంది. ఎంతో కాలంగా వేచివున్న పనులు పూర్తవుతాయి, మనోల్లాసమును కలిగి వుంటారు.
వృశ్చిక రాశి : శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేయవలసిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. నూతన ఆభరణములు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బులో కొంత భాగం చేతికందుతుంది.
ధనస్సు రాశి : చేపట్టవలసిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో అనుకోని విరోధములు ఏర్పడుతాయి. చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది.
మకర రాశి : పై అధికారుల మూలకంగా భయం ఏర్పడుతుంది. పితృవర్గము వారితో విరోధములు కలుగవచ్చును. మోకాళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు బాధిస్తాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
కుంభ రాశి : క్రీడాకారులు విజయం సాధిస్తారు. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. గృహనిర్మాణము, స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. భాగస్వాములతో చర్చలు ఆహ్లాదకరంగా వుంటాయి. మీ ప్రజ్ఞాపాటవాలను తగిన గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి : ఉద్యోగములో మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. శరీరానికి స్వస్థత లభిస్తుంది. పెద్దల మాటలతో స్ఫూర్తిని పొందుతారు. దాన ధర్మములకై ధనమును వెచ్చిస్తారు. సంతాన మూలకంగా శుభవార్తలను వింటారు.