Site icon vidhaatha

Cyber Crime | ఆన్ లైన్ మోసాలు.. బాధితులకు రూ.3.27కోట్లు రీఫండ్

విధాత: ఆన్ లైన్ మోసాల బాధితులకు రూ.3.27కోట్లు రీఫండ్ చేసినట్లుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్, అధిక లాభాల పెట్టుబడులు, ఫెడెక్స్, మనీలాండరింగ్ పేరులతో సైబర్ నేరగాళ్లుమోసాలకు పాల్పడ్డారని తెలిపారు. స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాల్లో 32 మంది బాధితులకు 1.62 కోట్లు రీఫండ్ చేసిన పోలీసులు పేర్కొన్నారు.

అలాగే ఫెడెక్స్, మనీలాండరింగ్ మోసాల్లో 14 మంది బాధితులకు 1.57 కోట్లు రీఫండ్ చేశామన్నారు. మార్చిలో 54 మంది సైబర్ బాధితులకు ఆ మేరకు రీఫండ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైప మైనర్ డ్రైవింగ్ నియంత్రణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరిన్ని చర్యలకు ఉపక్రమించారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులను కూడా బాధ్యులవుతారని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి కేసుల్లో వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేయనున్నట్లుగా తెలిపారు.

Exit mobile version