విధాత: ప్రతి వ్యక్తికి ఏదోఒక సమయంలో అత్యవసరంగా నగదు అవసం పడుతుంది. దీంతో వెంటనే వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లీ అధిక వడ్డీకి డబ్బు తీసుకుంటారు.. కానీ సులువుగా లభించే పర్సనల్ లోన్ వైపు మాత్రం చూడరు. ఎందుకంటే దానీపై అనేక అపోహలు ఉంటాయి, ఉద్యోగం చేసేవారికి మాత్రమే పర్సనల్ లోన్ వస్తుందని, క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలని, ఇవన్నీ ఉన్నా సమయం ఎక్కువగా పడుతుందని అనుకుంటారు. అయితే పర్సనల్ లోన్ సంబంధించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంటో చూద్దాం.
నెలవారి జీతం తీసుకునేవారికి మాత్రమే వ్యక్తిగత రుణాలు వస్తాయనేది చాలామందిలో ఉండే అపోహ. అది ఏ మాత్రం వాస్తవం కాదు. ఫ్రీలాన్సర్లు, సెల్ఫ్ ఎంప్లాయిస్, బిజినెస్ చేసేవారు కూడా పర్సనల్ లోన్ పొందొచ్చు. లోన్ తీసుకోవాలనుకునే వారికి ఆదాయం స్థిరంగా ఉందా?, రీపేమెంట్ చేసే సామర్థ్యం ఉందా? అనే అంశాలు బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. ఇందుకోసం బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఐఆర్, బిజినెస్ ఇన్‌కం ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది.
ఇక క్రెడిట్ స్కోర్ విషయానికి వస్తే.. వ్యక్తిగత లోన్లు తీసుకుంటే ఇది తగ్గుతుందని అనుకుంటారు. అలా ఏమీ జరగదు. తరచూ లోన్స్ అప్లయ్ చేస్తూ ఉండేవారికి, లేదంటే రీపేమెంట్ విషయంలో డీఫాల్ట్ అయితేనే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది తప్ప లోన్లు తీసుకుని సరైన సమయంలో EMIలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. తద్వారా భవిష్యత్తులో మరిన్ని లోన్లు తీసుకునేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
పర్సనల్ లోన్లు అంత సులువుగా పొందలేమన్న అనుమానాలు కూడా ఉంటాయి. వ్యక్తిగత రుణం పొందడం ఎంతో సులభం. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో బ్యాంకులకు కూడా వెళ్లే అవసరం లేకుండా పోయింది. ఎక్కువ సందర్భాల్లో బ్యాంకులే మనల్ని సంప్రదిస్తాయి. ఆన్‌లైన్ డాక్యూమెంట్లు, ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పిస్తే సరిపోతుంది. సరైన ఆదాయం, క్రెడిట్ హిస్టరీ సరిగ్గా ఉంటే పర్సనల్ లోన్ పెద్ద సమస్యేమీ కాదు.
ఇక లోన్ ప్రాసెసెంగ్ సమయానికి వస్తే రోజుల తరబడి వేచి చూడాలని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ప్రస్తుత కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ వల్ల ఎక్కువలో ఎక్కువగా 24 గంటల నుంచి 48 గంటల్లోనే పని పూర్తవుతుంది. కొన్ని సార్లు గంటల వ్యవధిలోనే లోన్ అప్రూవల్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ బాగా ఉండేవారికి బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తుంటాయి. మీకు లోన్ అవసరమైనప్పుడు క్లిక్ చేస్తే క్షణాల్లో మీ ఖాతాలో డబ్బు జమ అవుతున్నది.
వ్యక్తిగత లోన్లు కేవలం ఒకటి మాత్రమే కాదు రెండు కూడా తీసుకోవచ్చు. ఈ విషయంలో చాలా మందికి ఇంతకు ముందే ఓ లోన్ తీసుకున్నాను, మళ్లీ తీసుకోవచ్చా అనే సందేహాలు ఉంటాయి. లోన్లు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు లోన్ ఆదాయ నిష్పత్తిని మాత్రేమే పరిశీలిస్తాయి, మీరు ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా నిర్వహిస్తే మరో లోన్ తీసుకోవడానికి ఇబ్బందులు ఉండవు.
