Site icon vidhaatha

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు

విధాత: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసింది. తన
పాస్ పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించింది. ప్రభాకర్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లుగా తెలుస్తుంది.

అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు స్పీడ్ తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే క్యాన్సర్ చికిత్స పేరుతో అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు ముందుస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఈ కేసు విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నే కీలకమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు.

ఎస్ఐబీలో ఎస్ వోటీని నెలకొల్పిందే ప్రభాకర్ రావు అని..ఆయన అధ్వర్యంలో పనిచేసిన ఎస్ వోటీ విభాగం ఫోన్ ట్యాపింగ్ లక్ష్యంగా పనిచేసిందని వివరించారు. ప్రతిపక్ష నేతలు, ఎంపిక చేసుకున్న అధికారులు, వ్యాపారులను, రియల్టర్ల ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశారని నివేదించారు. ఎన్నికల ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి వారి డబ్బులను పట్టుకుని అప్పటి అధికార పార్టీకి సహకరించాని తెలిపారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టివేసి, దర్యాప్తుకు సహకరించేలా ఆదేశివ్వాలని కోర్టును అభ్యర్థించారు.

మరోవైపు ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు శ్రవణ్ రావు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అరెస్టు వంటి చర్యలు తీసుకోరాదని దర్యాప్తు సంస్థకు సూచించింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని శ్రవణ్ రావును ఆదేశించింది. దీంతో అతను ప్రస్తుతం పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. మిగతా నిందితులైన ప్రణీత్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, రాధాకిషన్ రావులను దర్యాప్తు సంస్థ ఇప్పటికే విచారించింది.

Exit mobile version