Site icon vidhaatha

ISS: త్వరలోనే.. వారిద్ధరూ భూమి మీదకు!

ISS:

విధాత: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సహా విల్ మోర్ లు త్వరలోనే తిరిగి భూమిమీదకు చేరుకోనున్నారు. వ్యోమోగామి బుచ్ విల్ మోర్‌తో కలిసి గతేడాడి జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునితా విలియమ్స్ ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు 8రోజులకే వారు తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉండగా..స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమికి చేరుకుంది.

అప్పటి నుంచి 9నెలలుగా వారిద్ధరూ ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. వారిని తిరిగి భూమికి తీసుకరావడానికి నాసా, స్పేస్ ఎక్స్‌లు కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ కే వెళ్లనుంది. ఆ నౌకలోనే సునితా విలియమ్స్, విల్ మోర్ లు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు.

తాజాగా సునితా విలియమ్స్ ఐఎస్ఎస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే భూమిమీదకు చేరుకుంటానని..రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నానని తెలిపారు. నా ఇంట్లో రెండు లాబ్రాడర్ శునకాలు ఉన్నాయని..వాటిని నేను ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నానని చెప్పారు. నేను వచ్చేదాకా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండంటూ కుటుంబసభ్యులకు నవ్వుతు చెప్పారు.

ఇక విల్ మోర్ మాట్లాడుతూ తమను భూమిపై తీసుకొచ్చేందుకు బైడైన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన విమర్శలపై స్పందించారు. రాజకీయాలు జీవితంలో భాగమని.. అయితే తాము తిరిగి వెనక్కి వచ్చే విషయంలో అవి ఎలాంటి పాత్ర పోషించలేదని వ్యాఖ్యానించారు.

Exit mobile version