South West Monsoon | ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు అతి త్వరలో తెలంగాణను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 10వ తేదీ నాటికి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. ఆరేబియా సముద్రం నుంచి అండమాన్ నికోబార్ దీవుల మీదుగా బర్మా (రంగూన్) వరకు రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 13వ తేదీ నుంచి రుతు పవనాల్లో కదలిక రావడంతో వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి.
ఈ రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం నుంచి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవుల్లోకి చకచకా విస్తరించాయి. మరో మూడునాలుగు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్నాయి. ఇలా చక చకా కదులుతున్న రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరం తాకి, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి ఏపీలో ప్రవేశించి పురోగమిస్తాయి. జూన్ 10వ తేదీ నాటికి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తాయని వాతావరన శాఖ ప్రకటించింది. ఈ మేరకు రుతుపవనాల పురోగమనాన్ని తెలియజేసే మ్యాప్ విడుదల చేసింది. రుతుపవనాలు జూన్ నెలాఖరు వరకు దేశమంతటా విస్తరిస్తాయి.
రుతుపవనాలు రైతాంగానికి అత్యంత కీలకమైనవి. దేశంలో మెజార్టీ సాగు వర్షాధారితమే. రుతు పవనాలు రాక ముందుగానే ప్రారంభం కావడంతో మే 19, 20 తేదీల నుంచే విత్తనాలు వేయడం ప్రారంభిస్తే మంచిదన్న అభిప్రాయం వాతావరణ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. మే 20వ తేదీ తరువాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి డబ్బులు!
Brain ‘Stent’ | బ్రెయిన్ ద్వారా ఐఫోన్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో యాపిల్!
Operation Sindoor | తాజా ఇండో పాక్ యుద్ధక్రీడలో కర్త, కర్మ, క్రియలపై ఓ విశ్లేషణ – పార్ట్ 1
Vishnu Priya Bhimeneni | ఎర్ర కోక కట్టి నడుము అందాలను చూపిస్తూ… కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ