విధాత: శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు. గురువారం తెల్లవారు జామున డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,42,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం నుంచి గురువారం వరకూ కుడిగట్టు కేంద్రంలో 13.381 మిలియన్ యునిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 16.200 మిలియన్¯ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరుంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
ఈ ఏడాదిలో మూడోసారి తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు
<p>విధాత: శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు. గురువారం తెల్లవారు జామున డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని […]</p>
Latest News

రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
గుంటూరులో చదువలే..గూడు పుఠాణి తెలియదు : సీఎం రేవంత్ రెడ్డి