ChatGPT | పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థికి.. ఊహించని షాకిచ్చిన చాట్‌జీపీటీ

ChatGPT | ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు ఏఐని సాయం అడిగిన ఓ విద్యార్థికి చాట్‌జీపీటీ ఊహించిన రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ఎంత క్లిష్టమైన ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం దొరుకుతోంది. ఇదే అవకాశంగా భావించిన ఓ విద్యార్థి పరీక్షలో సులువుగా గట్టెక్కాలని ప్లాన్ చేశాడు. ఎలాగోలా మొబైల్ ఫోన్‌ను ఎగ్జామ్ హాల్‌లోకి తీసుకెళ్లి, ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి చాట్‌జీపీటీకి పంపించి సమాధానాలు అడగాడు. కానీ వాటికి సమాధాలివ్వడానికి బదులు చాట్‌జీపీటీ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

ఈ ఉదంతాన్ని పుష్పాంజలి సింగ్ అనే నెటిజన్ లింక్‌డ్‌ఇన్ ద్వారా పంచుకున్నారు. దాని ప్రకారం ఓ విద్యార్థి పరీక్ష రాస్తున్న సమయంలో చాట్‌జీపీటీ సాయం కోరాడు. అయితే విద్యార్థి పరీక్ష రాస్తుండగా తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడిగినట్లు చాట్‌జీపీటీ గుర్తించింది. దీంతో సమాధానం చెప్పేందుకు నిరాకరించింది. చూస్తుంటే మీరు పరీక్ష మధ్యలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలా పరీక్షలో నేరుగా సమాధానాలు చెప్పడం విద్యా నైతికతకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది.

చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పుష్పాంజలి సింగ్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. పరీక్ష మధ్యలో చాట్‌జీపీటీ సాయం అడిగితే.. అది నిరాకరించింది అనే క్యాప్షన్‌ను కూడా పెట్టాడు. మరి ఇదే పరిస్థితి మీ తదుపరి ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్‌లో ఎదురైతే ఎలా ఉంటుందని సరదాగా ప్రశ్నించాడు. ఆ పోస్టు కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ప్రీమియం వెర్షన్ వాడి ఉండటే సమాధానం వచ్చేదేమో అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించాడు. ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి చాట్‌జీపీటీ అవసరమైతే అతనికి ఆ ఉద్యోగానికి అర్హత లేదన్నమాట అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ప్రీమియం వెర్షన్ వాడి ఉంటే సమాధానం వచ్చేదేమో” అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించగా, “ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ అవసరమైతే ఉద్యోగానికి అర్హత లేదన్నమాట” అని మరో వినియోగదారు అభిప్రాయపడ్డారు. అసలు విద్యార్థి పరీక్షలో ఉన్నాడని చాట్‌జీపీటీకి ఎలా తెలిసిందని మరొకరు సందేహం వ్యక్తం చేశాడు. ప్రశ్నాపత్రం కూడా చాట్‌జీపీటీతోనే తయారు చేసి ఉంటారు.. అందుకే ముందే గుర్తుపట్టేసింది అంటూ మరొకరు కౌంటరిచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్‌తో ఈ ఉదంతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Latest News