Oh Bhama Ayyo Rama Teaser | ఓ భామ అయ్యో రామ! సుహాస్‌కు.. మ‌రో హిట్ గ్యారంటీ!

Oh Bhama Ayyo Rama Teaser | Suhas | Malavika Manoj విధాత‌: అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, జ‌న‌క అయితే గ‌న‌క‌ వంటి ఢిఫ‌రెంట్ హిట్ చిత్రాల త‌ర్వాత జూనియ‌ర్ నాచుర‌ల్ స్టార్ సుహాస్ (Suhas) న‌టిస్తోన్న కొత్త చిత్రం ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama). మ‌ల‌యాళ సెన్షేష‌న్ మాళ‌విక మ‌నోజ్ (Malavika Manoj) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గోదాల రామ్ (Ram Godhala) ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం […]

Oh Bhama Ayyo Rama Teaser | Suhas | Malavika Manoj

విధాత‌: అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, జ‌న‌క అయితే గ‌న‌క‌ వంటి ఢిఫ‌రెంట్ హిట్ చిత్రాల త‌ర్వాత జూనియ‌ర్ నాచుర‌ల్ స్టార్ సుహాస్ (Suhas) న‌టిస్తోన్న కొత్త చిత్రం ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama). మ‌ల‌యాళ సెన్షేష‌న్ మాళ‌విక మ‌నోజ్ (Malavika Manoj) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గోదాల రామ్ (Ram Godhala) ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా వీ ఆర్ట్స్ (V ARTS) బ్యాన‌ర్‌పై హ‌రీష్ న‌ల్లా నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న రాడాన్ (Radhan) ఈ మూవీకి సంగీతం అందించాడు.

ఈ వేస‌విలో ఈ సినిమా ప్రేఓకుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో తాజాగా ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ఈ సారి కూడా సుహాస్‌కు మంచి హిట్ ప‌డేలా క‌నిపిస్తోంది. అడాళ్ల‌ను న‌మ్మొద్దు అంటూ ప‌దే ప‌దే చెప్పించిన మాట‌లు, హీరోయిన్ క్యారెక్ట‌ర్ వేరియేష‌న్స్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా ఉండ‌నున్న‌ట్లు ఇట్టే అర్థ‌మ‌వుతోంది. మనది బొమ్మరిల్లు కాదు, రక్తచరిత్ర అంటూ హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌.. చివర్లో అమ్మాయిలను నమ్మెద్దు బాబు. మోసం చేస్తారు బాబు అంటూ హీరో చెప్పే డైలాగ్‌ ఈ టీజర్‌లో అలరించే అంశాలు. టీజర్‌ క్వాలిటీ, ఫ్రేమ్స్‌ చూస్తుంటే ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నువ్వు నేను అనిత‌, అలీ, ర‌వీంద్ర‌ విజ‌య్‌, బ‌బ్లూ ఫృథ్వీ, ప్ర‌భాస్ శ్రీను, నాయ‌ని పావ‌ని, ర‌ఘు కారుమంచి ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.