Site icon vidhaatha

Revanth Reddy | జపాన్ పర్యటనకు.. వెళ్లిన‌ సీఎం రేవంత్ రెడ్డి

విధాత: రాష్ట్రానికి పెట్టుబడలను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కు బయల్దేరారు. సీఎం వెంట రాష్ట్ర అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్తుంది. ఏప్రిల్ 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌ పర్యటన కొనసాగుతుంది. సీఎం వెంట ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పర్యటనకు వెళుతున్నారు.

టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్ ఫో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధుల తో ముఖ్యమంత్రి బృందం సమావేశమవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపుతుంది.జపాన్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం 23న రాష్ట్రానికి చేరుకోనుంది.

Exit mobile version