విధాత: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) సూచించారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ బాధ్యతను కేంద్రంలోని బీజేపీ (BJP) తీసుకోవాలన్నారు. సమాజంలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదం చేశామని..అలాంటప్పుడు..మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నించారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చేర్చడంపై బీజేపీ అభ్యంతరం రాజకీయం మాత్రమేనన్నారు. కేంద్రం అమలులోకి తెచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు (EWS Reservation) అందరికి అవకాశమున్నప్పుడు లేని అభ్యంతరం బీసీ రిజర్వేషన్లపై ఎందుకన్నారు. 4 శాతం రిజర్వేషన్లు పొందలేని వారు ఈడబ్ల్యుఎస్ (EWS) అర్హులవుతారన్న సంగతి మరువరాదన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందన్నారు.