ఖండించిన కోడలు ప్రీతిరెడ్డి
IT Raid At Malla Reddy Son’s House | విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) కొడుకు భద్రారెడ్డి(Bhadra Reddy) నివాసంలో గురువారం ఐటీ సోదాలు జరిగినట్లుగా తెలిసింది. కొంపల్లిలోని(Kompally) భద్రారెడ్డి భవంతిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా ప్రచారం నెలకొంది. మల్లారెడ్డి హాస్పిటల్స్(Mallareddy Hospitals), మెడికల్ కాలేజీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారని..భద్రారెడ్డి(Bhadra Reddy) మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆన్‌లైన్, నగదు రూపంలో ఇటీవలి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారులు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారని తెలుస్తుంది.
అయితే ఐటీ దాడులను మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఖండించారు. ఇంటికి వచ్చింది వరంగల్ జిల్లా పోలీసులని..ఐటీ, ఈడీ అధికారులు కాదని పేర్కొంది. 2022లో పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి కాళోజీ యూనివర్సిటీ కేసులో వెరిఫికేషన్..నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారని వివరించారు. మా నివాసంలో ఎలాంటి ఐటీ, ఈడీ సోదాలు జరుగలేదని స్పష్టం చేసింది. గతంలో మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన లెక్కల్లో చూపని ఆస్తులను స్వాధీనం ఈడీ సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకుంది.