Volonaut’s Airbike : ఆకాశంలో రయ్..రయ్..ఎయిర్ బైక్ లు వచ్చేశాయ్..!

జెట్ ప్రొపల్షన్‌తో ఎగిరే వోలోనాట్ ఎయిర్‌బైక్ విజయవంతం. రోడ్లపై బైక్ మాదిరిగానే త్వరలో ఆకాశంలో రయ్ రయ్ రైడింగ్ సదుపాయం రానుందని నిపుణుల అంచనా.

Volonaut's Airbike

విధాత : ఎగిరే విమానాలు..హెలికాప్టర్ల మాదిరిగా త్వరలో ఎగిరే బైక్ లు రాబోతున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రయోగాలను పూర్తి చేసిన శాస్ర్తవేత్తలు వాటి ఆవిష్కరణలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఒక మనిషి కూర్చుని ప్రయాణించే మోడల్ లో ఎయిర్ బైక్ లను రెడీ చేస్తున్నారు. భవిష్యత్తులో రోడ్ల మీద బైక్ సవారీ మాదిరిగానే…ఆకాశంలో ఎయిర్ బైక్ రైడింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. సాంప్రదాయ మోటార్‌సైకిల్ కంటే ఏడు రెట్లు తక్కువగా..67 పౌండ్ల బరువుతో జెట్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ హోవర్‌బైక్ అయిన వోలోనాట్ ఎయిర్‌బైక్ ప్రయోగ దశలో విజయవంతమైంది. తక్కువ ఎత్తులో నిలువు టేకాఫ్, ఖచ్చితమైన ల్యాండింగ్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇటాలియన్ సైప్రస్ చెట్ల మధ్య ఒక రైడర్ ఒక ప్లాట్‌ఫామ్‌పై ఎగిరి కిందకు ల్యాండైన ఎయిర్ బైక్ వీడియో వైరల్ గా మారింది. సైన్స్-ఫిక్షన్ సినిమా తరహాలో ఆకాశంలో ఓ ఎయిర్ బైక్ దూసుకెళ్లడం..హలీవుడ్ అవెంజర్ సినిమాను తలపించింది. ఎయిర్ బైక్ రాక..వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పు కాబోతుందంటున్నారు పరిశోధకులు.

ఎగిరే బైక్ అనగానే విమానాలు, హెలికాప్టర్ల మాదిరిగా రెక్కలు, రోటర్లు ఉంటాయని అంతా ఊహిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఎలాంటి రెక్కలు, రోటర్లు లేకుండా వోలోనాట్ ఎయిర్ బైక్ గంటకు 200 కిలో మీటర్ల వేగనాన్ని చేరుకునేలా రూపొందించబడింది. 124 మైళ్ల వేగంతో ఒక వ్యక్తిని మోసుకెళ్లేలా డిజైన్ చేశారు. గరిష్టంగా 10 నుంచి 12నిమిషాలు మాత్రమే ఎయిర్ బైక్ లో ప్రయాణించగలడం గమనార్హం. ఇంధనంగా డీజిల్, బయోడీజిల్, జెట్-ఏ1, కిరోసిన్ లను వినియోగించే అవకాశం ఉంది. ఒక నిమిషం వ్యవధిలో ఇంధనం నింపుకోవచ్చు. అద్భుతమైన వోలోనాట్ ఎయిర్‌బైక్ అనేది జెట్-శక్తితో నడిచే వ్యక్తిగత విమానం.

“సూపర్ బైక్ ఫర్ ది స్కైస్” జెట్ ప్రొపల్షన్ ద్వారా శక్తిని పొందుతుంది. $880,000 ప్రోటోటైప్‌లోని స్టెబిలైజేషన్ సిస్టమ్ తో ప్రయాణంలో అసమతుల్యతలను ఎదుర్కొని రైడర్ కు డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది. 360 డిగ్రీల వీక్షణతో కూడిన ప్రత్యేకమైన రైడింగ్ పొజిషన్ లో సాగిపోతుంది. టోమాస్ పటాన్ సంవత్సరాల తరబడి స్టిల్త్ మోడ్ లో ఈ ఎయిర్ బైక్ ను అభివృద్ధి చేశాడు. అధునాతన కార్బన్ ఫైబర్ పదార్థాలు, 3డి ప్రింటింగ్, మినిమలిస్టిక్ విధానం కారణంగా ఎయిర్‌బైక్ సాధారణ మోటార్‌సైకిల్ కంటే 7 రెట్లు తేలికైనదిగా రూపొందించబడటం విశేషం.

ఇవి కూడా చదవండి :

Shah Rukh Khan And Kajol : లండన్ లో షారుఖ్-కాజోల్ జంట కాంస్య విగ్రహావిష్కరణ
Tirumala : తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం

Latest News