Site icon vidhaatha

Aman Sherawat | 10 గంటల్లో 4.6 కిలోల బరువు తగ్గిన కాంస్యం నెగ్గిన అమన్‌ సెహ్రావత్‌..! ఇది ఎలా సాధ్యమందో తెలుసా..?

Aman Sherawat | పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ కాంస్య పతకం నెగ్గాడు. దీంతో భారత్‌ ఖాతాలో ఆరో పతకం చేరింది. అయితే, సెమీ ఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు అమన్‌ సెహ్రావత్‌ ఏకంగా 4.6 కిలోల బరువు పెరిగి 61.5 కిలోలకు చేరుకున్నాడు. దాంతో భారత శిబిరంలో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే వినేశ్‌ ఫోగట్‌ అధిక బరువు కారణంగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి టెన్షన్‌కు గురైన సిబ్బంది.. మ్యాచ్‌కు ముందు బరువు తగ్గించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. సీనియర్‌ రెజ్లింగ్‌ కోచ్‌లు జగ్మందర్‌ సింగ్‌, వీరేంద్ర సింగ్‌ దహియాతో పాటు ఆరుగురు సిబ్బంది బరువు తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు.

రెజ్లర్‌ అమన్‌ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌ ఆటగాడు హిగుచి చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత బరువును పరిశీలించగా 4.6 కిలోల బరువు అదనంగా ఉన్నది. వాస్తవానికి 57 కిలోల విభాగంలో ఉన్నాడు. దాంతో సహాయక సిబ్బంది, కోచింగ్‌ సిబ్బంది బరువు తగ్గించే పనిలో పడ్డారు. ఒకటిన్నర పాటు మ్యాట్ సెషన్‌ నిర్వహించారు. ఇద్దరు సీనియర్ కోచ్‌లు అమన్‌ను స్టాండింగ్ రెజ్లింగ్‌ ఆడించారు. అనంతరం గంటపాటు హాట్‌ బాత్‌ సెషన్‌ చేపట్టారు. ఆ తర్వాత 12.30 గంటలకు జిమ్‌కు తీసుకెళ్లారు. ట్రెడ్‌మిల్‌పై నాన్‌స్టాప్‌గా గంటపాటు ఆగకుండా పరుగెత్తాడు. బాగా చెమటలు పట్టడంతో డీహైడ్రేట్‌ అయ్యాడు. ఇవి బరువు తగ్గడంలో సహాయపడ్డాయి. ఆ తర్వాత 30 నిమిషాలు విరామం ఇచ్చి.. 5 నిమిషాల ఆవిరి స్నానం సెషన్‌ను ఐదుసార్లు నిర్వహించారు. చివరి సెషన్ ముగిసే సమయానికి అమన్ ఇంకా 900 గ్రాముల ఎక్కువ బరువు ఎక్కువగానే ఉన్నాడు. దాంతో అతనికి మసాజ్‌ చేయించారు. లైట్‌ జాగింగ్‌ చేయించారు కోచ్‌లు.. ఆ తర్వాత ఐదుసార్లు 15 నిమిషాల చెప్పున రన్నింగ్‌ సెషన్స్‌ నిర్వహించారు.

ఇక చివరకు అమన్‌ బరువు 56.9 కిలోలకు తగ్గింది. ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు తక్కువగా ఉండడంతో కోచ్‌లు, బృందం ఊపిరిపీల్చుకున్నారు. వెయిట్‌ తగ్గే సమయంలో అమన్‌ సెహ్రావత్‌ నిద్ర లేకుండా గపడపడడం విశేషం. ఆయా సెషన్స్‌ మధ్య కేవలం నిమ్మకాయ రసం, తేనే కలిపిన నీటిని, కొంచెం కాఫీ మాత్రమే అందిస్తూ వచ్చారు. కంటి మీద కనుకు లేకుండా విరామ సమయాల్లో రెజ్లింగ్‌ వీడియోలు చేస్తూ సమయం గడిపారు. చివరకు మ్యాచ్‌లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను అమన్13-5తో ఓడించి కాంస్య పతకం నెగ్గాడు. ఇదిలా ఉండగా.. 50 కేజీల మహిళల విభాగంలో 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో వినేశ్‌ ఫోగట్‌ పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌కు ముందు వెయిట్‌ పెరగడంతో తనకు కనీసం సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలని స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌కు అప్పీల్‌ చేసింది. దీనిపై ఆర్బిట్రేషన్‌ విచారణ జరిపింది.

Exit mobile version