‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ కేసులో డేవిడ్‌ వార్నర్‌ అరెస్టు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్టయ్యాడు. సిడ్నీలో మద్యం మోతాదు అధికంగా ఉన్నట్లు తేలింది.

David warner

విధాత : ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్టయ్యాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అతడిపై ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ కేసు నమోదైంది. వచ్చే నెలలో అతడు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 39 ఏళ్ల వార్నర్‌ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

ఆస్ట్రేలియా మీడియా నివేదికల ప్రకారం సిడ్నీలోని మారుబ్రాలో వార్నర్‌ను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు బ్రీత్ టెస్ట్ సందర్భంగా ఆపారు. టెస్టింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేయడానికి ప్రయత్నించడంతో, అధికారులు ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన నిర్వహించిన పరీక్షలో, అతను అనుమతించదగిన పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది. వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా తేలిందని సమాచారం. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధమైన పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువ. సిడ్నీ పోలీసులు వార్నర్ పే కేసు నమోదుతో పాటు అరెస్టు చేసి మారుబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ మాజీ ఆస్ట్రేలియన్ బ్యాటర్‌ను వచ్చే నెలలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

పీఎస్ఎల్ లో వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ వరుసగా మూడు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రావల్పిండిజ్‌పై కీలకమైన అర్ధ సెంచరీతో సహా ఇప్పటివరకు 93 పరుగులు సాధించిన వార్నర్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కింగ్స్ జట్టు ఏప్రిల్ 9 గురువారం నాడు కరాచీలోని నేషనల్ స్టేడియంలో పెషావర్ జల్మీతో తలపడనుంది. తన ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌కు, మ్యాచ్‌ల మధ్యలో తన కుటుంబాన్ని కలవడానికి టోర్నమెంట్ నుండి కొద్దికాలం వ్యక్తిగత సెలవు మంజూరు చేయబడింది. వార్నర్ డ్రంక్ ఆండ్ డ్రైవ్ అరెస్టు నేపథ్యంలో మునుముందు ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇటువంటి అనుమతులను నిలిపివేయవచ్చన సమాచారం.

ఇవి కూడా చదవండి :

మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌
మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌

Latest News