మంత్రి వాకిటిపై పేపర్లు విసిరేసిన పొంగులేటి..బీసీ సంఘాల ఫైర్

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఖరిపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఖరిపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా చేరిన విషయాన్ని వివరిస్తూ…ఈ విషయమై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిర్వహించిన చర్చను మీడియాకు మంత్రి పొంగులేటి వివరిస్తుండగా..పక్కనే ఉన్న మంత్రి శ్రీహరి ఆయనకు ఏవో పేపర్లు అందించారు.

వాటిని పరిశీలించిన పొంగులేటి అసహనంతో ఆ పేపర్లను ఆయన ముందుకే చేతుల మీదకు విసిరేసి..తన ప్రెస్ మీట్ ను కొనసాగించారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి చర్య బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించే విధంగా ఉందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.

24 గంటల్లో క్షమాపణ చెప్పాలి

ప్రెస్ మీట్ మధ్యలో బీసీ ప్రజల ప్రతినిధియైన మంత్రి వాకిటి శ్రీహరిపై పేపర్లు విసిరేసి, అవమానించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటుందని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర్కొంది.  24 గంటల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

 

Latest News