స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,59,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,45,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,59,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,45,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

దేశంలో వార్షిక బంగారం డిమాండ్‌ను కేవలం సుంకాలు మాత్రమే కాకుండా ప్రస్తుత బంగారం ధరలు, ప్రజల ఆదాయ స్థాయిలు, దేశీయ ద్రవ్యోల్బణం, రుతుపవనాల (వర్షపాత) పరిస్థితులు వంటి విభిన్న అంశాలు ప్రభావితం చేస్తాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో విశ్లేషించింది. కౌన్సిల్ రూపొందించిన ఆర్థిక నమూనాల ప్రకారం.. దిగుమతి సుంకాల మార్పులు స్వల్ప, దీర్ఘకాలికంగా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొంది. బంగారంపై దిగుమతుల సుంకం 15 శాతం పెంచడం అధికారిక మార్కెట్ లో బంగారం డిమాండ్‌ను 10 శాతం మేర తగ్గించడమే కాకుండా, పరోక్షంగా అక్రమ బంగారం రవాణా మార్గాలకు మళ్లీ ఊతం ఇచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News