Site icon vidhaatha

Ind vs SA|నేటి నుండి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. అంద‌రి దృష్టి ఆ కుర్రాడి పైనే..!

Ind vs SA|సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్‌తో టీమిండియా దారుణ‌మైన ఓట‌మి చెంద‌డంతో అభిమానులు దానిని ఇంకా జీర్ణించుకోలేపోతున్నారు. అయితే నాలుగు టీ20ల సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్ మొద‌లు కానుంది. గతేడాది కూడా సూర్య సారథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌గా, అప్పుడు ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈసారి సౌతాఫ్రికాలో జరిగే టీ20 సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పైనే ఉన్నాయని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు.

దాదాపు దశాబ్దం క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఇప్పటికీ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. మ‌రి ఈ సిరీస్‌లో అయిన రాణించి రానున్న సిరీస్‌లో అవ‌కాశం ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ నుంచి అభిషేక్ శర్మ ఓపెనింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కు ఓపెనర్‌ అవకాశం లభించింది. దాన్ని సంజూ అందిపుచ్చుకుని అద్భుత సెంచరీ కూడా చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో స్థానంలో వస్తాడు. అతడితో పాటు తిలక్ వర్మ కూడా మిడిలార్డర్‌లో చోటు దక్కించుకోవచ్చు. గాయం నుంచి కోలుకున్న తర్వాత చాలా కాలం తర్వాత తిలక్ వర్మ టీ20 జట్టులోకి వచ్చాడు.

ఇక హార్ధిక్ పాండ్యా కూడా జ‌ట్టులో భాగం కానున్నాడు. అతను 5వ స్థానంలో రావచ్చు. ఇది కాకుండా రింకూ సింగ్, అక్షర్ పటేల్‌లకు ఫినిషింగ్ వస్తారు. ప్లేయింగ్ 11 లో 1 స్పిన్నర్, 3 ఫాస్ట్ బౌలర్లను ఉండే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. వరుణ్ చక్రవర్తి స్పిన్నర్‌గా అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్, అవేష్ ఖాన్ ఫాస్ట్ బౌలర్‌లుగా జట్టులో ఉంటారు. ఒకవేళ యశ్ దయాల్‌కు అవకాశం లభిస్తే, ఇది అతనికి తొలి మ్యాచ్ అవుతుంది. దీంతో పాటు జితేష్ శర్మ, రమణదీప్ సింగ్, రవి బిష్ణోయ్, విజయ్‌కుమార్ విశాక్ వంటి ఆటగాళ్లు కూడా టీమ్ ఇండియా జట్టులో ఉన్నారు.తొలి టీ20 శుక్రవారం జరగనుండగా.. రెండో టీ20 ఆదివారం(నవంబర్ 10), మూడో టీ20 బుధవారం(నవంబర్ 13), నాలుగో టీ20 శుక్రవారం( నవంబర్ 15) జరగనున్నాయి.

Exit mobile version