IND vs SA Final| నేడు భార‌త్-సౌతాఫ్రికా ఫైన‌ల్ మ్యాచ్.. వామ్మో ఈ ఇద్ద‌రు అంపైర్ల‌ని చూసి హ‌డ‌ల్

IND vs SA Final| గ‌త కొద్ది రోజులుగా క్రికెట్ ప్రేమికుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్న టీ 20 ప్ర‌పంచ కప్ ఈ రోజు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియ‌నుంది. తొలిసారి ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టిన సౌతాఫ్రికా ఎలాగైన క‌ప్ కొట్టాల‌నే క‌సితో ఉండ‌గా, భార‌త జ‌ట్టు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాల

  • Publish Date - June 29, 2024 / 07:20 AM IST

IND vs SA Final| గ‌త కొద్ది రోజులుగా క్రికెట్ ప్రేమికుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్న టీ 20 ప్ర‌పంచ కప్ ఈ రోజు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియ‌నుంది. తొలిసారి ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టిన సౌతాఫ్రికా ఎలాగైన క‌ప్ కొట్టాల‌నే క‌సితో ఉండ‌గా, భార‌త జ‌ట్టు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని చూస్తుంది. రెండు జ‌ట్లు బ‌ల‌బ‌లాలు చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ ఇరు టీమ్స్ స‌మంగా ఉన్నాయి. ఫైనల్స్ వరకు ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడింది లేదు . ఏ జట్టు గెలిచినా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకున్న జ‌ట్టుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అద్భుతం సృష్టించ‌బోతున్నారు. అయితే బార్బడోస్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కురుస్తుందా లేదా అనే సందేహం అభిమానుల‌లో ఉంది.

శనివారం ఫైనల్ మ్యాచ్ రోజున 70-78 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఒకవేళ వర్షం అంతరాయంతో శనివారం మ్యాచ్ జరగ‌ని ప‌క్షంలో ఆదివారం నిర్వహిస్తారు. ఆదివారం కూడా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఇరు జ‌ట్లు కనీసం 10 ఓవ‌ర్లు అయిన ఆడేలా 190 నిమిషాలు అదనపు సమయాన్నీ రెండు రోజులకు కేటాయించారు . రిజర్వ్ డేతో కలుపుకొని కటాఫ్ సమయంలో ఇరు జట్లు 10 ఓవర్లు ఆడని ప‌క్షంలో మ్యాచ్ ర‌ద్దు చేసి ఇరు జ‌ట్ల‌ని విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారు. వర్షం కారణంగా శనివారం మధ్యలోనే మ్యాచ్ ఆగిపోతే.. రిజర్వ్‌డే అయిన ఆదివారం అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక ఈ వికెట్‌పై అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలుపొంద‌డం విశేషం. సౌతాఫ్రికా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. టాస్ గెలిచిన వారు ముందు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉంది.

ఇక ఈ మ్యాచ్‌కి న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బ్రో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన రోడ్నీ టక్కర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారు. రిచీ రిచర్డ్‌సన్ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే ఇక్క‌డే ఓ బ్యాడ్ సెంటిమెంట్ టీమిండియాని టెన్ష‌న్ పెడుతుంది. గ‌త నాలుగేళ్ల‌లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బ్రోలు అంపైర్లుగా ఉన్న ఐసీసీ టోర్న‌మెంట్స్‌లో భార‌త్ అన్ని ఓడిపోయింది. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 WTC ఫైనల్, 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లలో భారత్ ఓట‌మి చవి చూసింది. అప్పుడు ఈ ఇద్ద‌రు కూడా అంపైర్స్‌గా ఉన్నారు. ఇప్పుడు టీ20 ప్ర‌పంచ‌కప్ 2024 ఫైన‌ల్‌కి కూడా ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బ్రోలు ఉండ‌డంతో భార‌త అభిమానులు కాస్త టెన్ష‌న్‌లో ఉన్నారు.

Latest News