విధాత : అస్ట్రేలియాతో కరారా వేదికగా జరుగుతున్న నాల్గవ టీ 20మ్యాచ్ లో టీమిండియా 48పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5మ్యాచ్ లో టీ 20సిరీస్ లో 2-1తో ఆధిక్యత సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 8వికెట్ల నష్టానికి 20ఓవర్లలో 167పరుగులు చేసింది. 168పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అసీస్ జట్టు 18.2ఓవర్లలో 119పరుగులకు అలౌటైంది. దీంతో ఆసీస్ పై భారత్ 48పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి అసీస్ బ్యాటర్లను అలౌట్ చేశారు. ఆ జట్టులో ఓపెనర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (30 ) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ మాధ్యూ షార్ట్ (25), జోష్ ఇంగ్లీస్ (12), టీమ్ డెవిడ్(14), జోష్ ఫిలీప్(10), స్టెయినీస్(17) పరుగులు చేశారు. గ్లెన్ మాక్స్ వెల్(2) పరుగులకే అవుటయ్యాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 1.2ఓవర్లు మాత్రమే వేసి 3పరుగులిచ్చి 3వికెట్లు పడగొట్టి అసీస్ పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్, శివమ్ దూబె చెరో 2వికెట్లు, అర్షదీప్ సింగ్, బూమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సాధించారు.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 6.4ఓవర్ లో అభిషేక్ శర్మ(28) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వతా వరుస వికెట్లు నష్టపోతూ చివరకు అసీస్ ముందు 167పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
చివర్లో అక్షర పటేల్(21 నాటౌట్) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. టీమిండియా బ్యాటర్లలో గిల్(48), శివమ్ దూబే (22), సూర్యకుమార్(20), తిలక్ వర్మ(5), జితేశ్ శర్మ(3), వాషింగ్టన్ సుందర్(12), అక్షర పటేల్(21 నాటౌట్), అర్షదీప్(0), వరుణ్ చక్రవర్తి(1 నాటౌట్) పరుగులు సాధించారు.
అస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలీస్, అడమ్ జంపా తలో 3వికెట్లు, స్టెయినీస్, బార్టెలెట్ చెరో వికెట్ సాధించారు.
