IPl 2024 Mi vs RCB | ‘స్కై’ మెరుపుదాడి – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ముంబై ఇండియన్స్ విజ‌యం

సూర్యకుమార్ యాద‌వ్ గాయం త‌ర్వాత జ‌ట్టుతో చేరి మునుప‌టి ఆట‌తో ముంబ‌యిని మురిపించాడు. త‌న సొంత మైదానంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో ముంబ‌యి ఘ‌న‌విజ‌యం సాధించింది. 197 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ముంబ‌యి 4 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది.

  • Publish Date - April 11, 2024 / 11:41 PM IST

సూర్యకుమార్ యాద‌వ్ గాయం త‌ర్వాత జ‌ట్టుతో చేరి మునుప‌టి ఆట‌తో ముంబ‌యిని మురిపించాడు. త‌న సొంత మైదానంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో ముంబ‌యి ఘ‌న‌విజ‌యం సాధించింది. 197 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ముంబ‌యి 4 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది.

అంత‌కుముందు, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) బ్యాట‌ర్లు కూడా శివాలూగిపోయారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(61), దినేశ్ కార్తిక్(53 నాటౌట్), ర‌జ‌త్ పాటిదార్‌(50)లు అర్ధ శ‌త‌కాల‌తో క‌దం తొక్కారు. దాంతో, ఆర్సీబీ 8 వికెట్ల న‌ష్టానికి 196 ర‌న్స్ చేసింది. ముంబై ఇండియ‌న్స్ స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అయిదు వికెట్లతో నిప్పులు చెరిగినా, దినేశ్ కార్తీక్ ఫినిష‌ర్‌గా త‌న పేరు నిల‌బెట్టుకున్నాడు. ఒక ద‌శ‌లో 23 పరుగులకే రెండు వికెట్లు ప‌డిన జ‌ట్టును డూప్లెసిస్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివ‌ర్లో కార్తిక్ ఉప్పెన‌లా విరుచుకుప‌డ్డాడు. ఆకాశ్ మ‌ద్ధాల్‌ను ఉతికారేస్తూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. దాంతో, ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్లలో  196 ప‌రుగుల స్కోర్ చేయ‌గ‌లిగింది. ముంబై బౌలర్ల‌లో బుమ్రా(5/21) ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆరంభంలోనే 23 ప‌రుగుల‌కు ఓపెన‌ర్లిద్దరినీ కోల్పోయిన బెంగ‌ళూరును కెప్టెన్ ఫాఫ్‌, ప‌టీదార్ ఆదుకున్నారు.

197 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబ‌యి ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ఆరంభించింది. ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్ ( 34 బంతుల్లో 69), రోహిత్‌శ‌ర్మ (24 బంతుల్లో 38) దంచి కొట్టగా, ప‌వ‌ర్‌ప్లేలో 72 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి వికెట్‌కు 101 ప‌రుగులు జోడించిన ఈ జంట‌, కిష‌న్ ఔట‌వ‌డంతో విడిపోయింది. అప్పుడు రోహిత్‌తో జ‌త‌క‌లిసిన సూర్యకుమార్ యాద‌వ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుప‌డ్డ స్కై 17 బంతుల్లోనే అర్థసెంచ‌రీ సాధించి త‌న 360 డిగ్రీ ఆటను రుచిచూపించాడు.  ఈ క్రమంలో రోహిత్ అవుట‌యినా, త‌న దూకుడు ఆప‌కుండా19 బంతుల్లో 52 ప‌రుగులు చేసిన సూర్య వైశాఖ్ బౌలింగ్‌లో లామ్రర్ చేతికి చిక్కాడు. అప్పటికే విజ‌యం ఖ‌రారు కావ‌డంతో మిగిలిన లాంఛనాన్ని కెప్టెన్ పాండ్యా, తిల‌క్‌వ‌ర్మలు పూర్తి చేసారు.

Latest News