ENG vs PAK| క్రికెట్‌లో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు సీరియస్‌గా చేసిన అవి సరదాగా మారుతుంటాయి. తాజాగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జో రూట్( Joe Root) చేసిన పని ఇప్పుడు అందరికి నవ్వు తెప్పిస్తుంది.బంతి షైన్ కావడం కోసం జో రూట్ చేసిన ఇంగ్లండ్( England) స్పిన్నర్ జాక్ లీచ్ బట్టతలపై బంతిని రుద్దాడు. ఫన్నీగా జో రూట్ చేసిన ఈ పనిని బ్రాడకాస్టర్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు… ‘బంతి షైన్ కోసం జో రూట్ కొత్త విధానాలు కనిపెడుతున్నాడు అంటూ ఫన్నీగా ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండడంతో పాటు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఇంగ్లండ్ – పాక్ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో అయి పాక్ (Pakitan) గెలిచితీరాలని అనుకుంటుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ అయిదు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కమ్రాన్ గుహ్లామ్ (118; 224 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఓపెనర్ సయిమ్ అయుబ్ (77; 160 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధశతకం సాధించడంతో పాకిస్తాన్ జట్టు భారీ స్కోరు దిశగా కదులుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. ఓపెనర్(Opener) అబ్దుల్లా షఫికీ (7; 28 బంతుల్లో, 1 ఫోర్), కెప్టెన్ షాన్ మసూద్ (3; 7 బంతుల్లో) 19 పరుగులు చేసి తక్కువ పరుగులకే పెవిలీయన్ బాట పట్టారు. ఆ సమయంలో కమ్రాన్‌తో కలిసి సయిమ్ 147 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అనంతరం ఇంగ్లండ్ బౌలర్స్ పదునైన బంతులు విసురుతూ పాక్ బ్యాట్స్‌మెన్స్‌ని ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో సయిమ్, సౌద్ షకీల్ (4; 14 బంతుల్లో, 1 ఫోర్) పది పరుగుల వ్యవధిలోనే ఔట్ చేసి పాకిస్తాన్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇక వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 89 బంతుల్లో, 4 ఫోర్లు), అఘూ సల్మాన్ (5 బ్యాటింగ్; 19 బంతుల్లో) ప్రస్తుతం క్రీజులో ఉండగా, వారు కాస్త బ్యాట్ ఝుళిపిస్తే పాకిస్తాన్ జట్టు మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది. ఇక ఇంగ్లండ్ బౌలర్స్ లో జాక్ లీచ్( Jack Leach) రెండు వికెట్లు, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సె, మాథ్యూ పాట్స్, షోయబ్ బసీర్ తలో వికెట్ తీశారు.