Site icon vidhaatha

IND vs NZ|పోరాడి ఓడిన టీమిండియా.. భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత కివీస్ విజ‌యం

IND vs NZ| బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ లో తొలి మ్యాచ్ టీమిండియా దారుణంగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగులకి ఆలౌట్ అయిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరే చేసింది. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్ ముందు 108 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది భార‌త్ . అయితే ఈ ల‌క్ష్యాన్ని కాపాడుకొని టీమిండియా అద్భుతం చేస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది.

108 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించింది. బుమ్రా త‌ప్ప భార‌త బౌల‌ర్స్ ఎవ‌రు పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. బుమ్రాకే రెండు వికెట్లు ద‌క్కాయి. మిగ‌తా బౌలర్స్‌ని న్యూజిలాండ్ బౌల‌ర్స్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎద‌రుర్కొన్నారు. ఈ ఓటమితో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పోరాటం వృథా అయ్యింది.

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది. అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ ప‌లు త‌ప్పులు చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది చాలా పెద్ద మిస్టుక్.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటవ్వడం.. రెండో ఇన్నింగ్స్‌లో లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచాయి.న్యూజిలాండ్ బౌల‌ర్స్ ప్ర‌ద‌ర్శించిన ప్ర‌ద‌ర్శన మ‌న బౌల‌ర్స్ ఎవ‌రు కూడా పెద్ద‌గా చేయ‌క‌పోవ‌డం టీమిండియాకి ప‌రాజ‌యం ద‌క్కేలా చేసింది.

Exit mobile version