RCB vs DC| వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌కి మరింత చేరువ‌గా…!

RCB vs DC| టోర్నీ ఆరంభంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో అభిమానుల‌కి నిరాశ క‌లిగించిన ఆర్సీబీ జ‌ట్టు ఇప్పుడు వ‌రుజ విజ‌యాలతో ప్లేఆఫ్స్ వైపుకి దూసుకుపోతుంది. ఐపీఎల్

  • Publish Date - May 13, 2024 / 06:34 AM IST

RCB vs DC| టోర్నీ ఆరంభంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో అభిమానుల‌కి నిరాశ క‌లిగించిన ఆర్సీబీ జ‌ట్టు ఇప్పుడు వ‌రుజ విజ‌యాలతో ప్లేఆఫ్స్ వైపుకి దూసుకుపోతుంది. ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన‌ 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ని చిత్తు చేసింది. దీంతో ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవ‌కాశాలు మ‌రింత మెరుగ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్సీబీ 13 మ్యాచ్‌లు ఆడ‌గా అందులో ఆరు విజ‌యాలు సాధించింది. ఏడు ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో 12 పాయింట్స్ సాధించింది. అయితే ఆర్స‌బీ త‌న తర్వాతి మ్యాచ్ మే 18న చెన్నైతో ఆడనుండి. ఈ మ్యాచ్ తో ఎవ‌రి భ‌వితవ్యం ఏంట‌నేది తేల‌నుంది.

ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో చెన్నై విజ‌యం సాధిస్తే ఆర్సీబీ టోర్నీ నుండి నిష్క్ర‌మించిన‌ట్టే. అదే బెంగ‌ళూరు క‌నుక భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీకి మంచి ర‌న్ రేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దాంతో ప్లే అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో కూడా బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.అయితే గ‌త రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) అర్ధసెంచ‌రీ చేయ‌గా, కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) జ‌ట్టుకి విలువైన ప‌రుగులు అందించారు.

ఇక 188 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ జ‌ట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులకు కుప్ప‌కూలింది. ఈ మ్యాచ్‌లో రిష‌బ్ పంత ఆడ‌క‌పోవ‌డంతో కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నాడు. అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో జ‌ట్టుని గెలిపించే ప్ర‌య‌త్నం చేయ‌గా, మిగ‌తా బ్యాట్స్‌మెన్ స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో ప‌రాజ‌యం పాల‌య్యారు. షైహోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) కొంత పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.ఈ ఓట‌మితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ కాస్త సంక్లిష్టంగా మార్చుకుంది. ఆర్‌సీబీ సూపర్ ఫీల్డింగే ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది అని చెప్పాల‌. రెండు రనౌట్స్, సంచలన క్యాచ్‌లతో మ్యాచ్ ఆర్సీబీ వైపుకి మ‌ళ్లింది.

Latest News