Rohit Sharma| గెలిచిన పిచ్‌పై మ‌ట్టి తిన్న రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకో వివ‌రించిన హిట్ మ్యాన్

Rohit Sharma| 2007లో టీ20 ప్ర‌పంచ క‌ప్ టీమిండియా సాధించ‌గా ఆ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఇక 17 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ టీమిండియా రోహిత్ నేతృత్వంలో క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. గత ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌స్ట్‌లో మిస్ కాగా, ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్క‌డం పట్ల జ‌ట్టు స‌భ్యులు చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క ఆట‌గాడు ఈ హ్యాపీ మూమెంట్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చిర‌స్మ‌ర‌

  • Publish Date - July 3, 2024 / 07:25 AM IST

Rohit Sharma| 2007లో టీ20 ప్ర‌పంచ క‌ప్ టీమిండియా సాధించ‌గా ఆ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఇక 17 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ టీమిండియా రోహిత్ నేతృత్వంలో క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. గత ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌స్ట్‌లో మిస్ కాగా, ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్క‌డం పట్ల జ‌ట్టు స‌భ్యులు చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క ఆట‌గాడు ఈ హ్యాపీ మూమెంట్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం తర్వాత చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఆనందంతో తమకు విజయాన్ని అందించిన పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు. ఇలా ఎందుకు చేశాడో ఎవ‌రికి అర్ధం కాలేదు. తాజాగా ఈ వీడియోలో వివరించాడు.

టీ20 వ‌ర‌ల్డ్ కప్‌లో విజ‌యం త‌ర్వాత రోహిత్ శ‌ర్మ చేసుకున్న సంబ‌రాల‌కి సంబంధించి బీసీసీఐ ఒక వీడియోని విడుద‌ల చేసింది. అందులో త‌న‌లోని ఫీలింగ్స్‌ని రోహిత్ షేర్ చేసుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్, 13 ఏళ్ల తర్వాత ఓ క్రికెట్ వరల్డ్ కప్, 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని టీమిండియాకు అందించిన రోహిత్ శ‌ర్మ‌ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయిన‌ట్టు తెలిపాడు. మాకు వ‌ర‌ల్డ్ క‌ప్ లో మంచి విజ‌యాన్ని సాధించి పెట్టిన ఆ పిచ్ ద‌గ్గరికి వెళ్లిన‌ప్పుడు నాలో అదే ఆలోచ‌న మెదిలింది. మేము ఆ పిచ్‌పై ఆడి గెల‌వ‌డం సంతోషంగా అనిపించింది. నా జీవితాంతం ఆ గ్రౌండ్‌, పిచ్ ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాను. మా క‌ల‌లు అన్ని కూడా నిజ‌మైన ప్రాంతం అది. నేను మ‌ట్టి తిన‌డం వెనక ఉద్దేశం అదే అంటూ రోహిత్ వివ‌రించాడు.

టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇప్ప‌టికీ క‌ల‌గానే అనిపిస్తుంది. అలా జ‌ర‌గ‌లేదేమో అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. గెలిచిన తర్వాతి క్షణాల‌ని మాట‌లలో వ‌ర్ణించ‌లేను. ఆ ఫీలింగ్ చాలా అద్భుతం.ఆ క్ష‌ణాన్ని పూర్తిగా మ‌ర‌చిపోలేక‌పోతున్నాను అని రోహిత్ అన్నాడు. గెలిచిన రోజు తాను నిద్ర కూడా పోలేదని చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్లుగా క‌ల క‌న్నాము. దానిని సాధించి తీరాము. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుఝాము వరకు తనతోపాటు టీమ్ మేట్స్ అంద‌రు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసిన‌ట్టు రోహిత్ తెలిపారు. ఇక కపిల్ దేవ్, ధోనీ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ చ‌రిత్ర‌లోకి ఎక్కాడు.

Latest News