Site icon vidhaatha

Meta Chat Bot | కృత్రిమ మేథ పిచ్చి.. పీక్‌ స్టేజ్‌కి! మెటా నుంచి రోల్‌ ప్లే చాట్‌బాట్‌!

Meta Chat Bot | రెండువైపులా పదునున్న కత్తిగా ఇంటర్‌నెట్‌ను ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఎందుకంటే.. దీనిని పాజిటివ్‌గా వాడుకుంటే విజ్ఞానం పెరుగుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులైతే వారి రోజువారీ ఎడ్యుకేషన్‌ను మరింత సులభతరం చేసుకోవచ్చు. ఇలా చేసేవారు చాలా మందే ఉన్నారు. అదే సమయంలో పనీపాటా లేనివారికి ఇదొక టైమ్‌పాసింగ్‌ తరహాలో తయారైంది. ఇప్పటికే అనేకమంది రేటెడ్‌ కంటెంట్‌ను ఇంటర్‌నెట్‌లోనే చూస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఊరికి దూరాన ఉన్న థియేటర్లలో, లేదా పాడుబడిపోయిన థియేటర్లలో అశ్లీల సినిమాలు వేస్తే.. ఇప్పుడు అవి అరచేతిలోకి చేరిపోయాయి. ఫోన్‌లోనే అన్నీ వచ్చేస్తున్నాయి.wh

అభ్యంతకర కంటెంట్‌ కుప్పలు కుప్పలు పేరుకుపోయిన ఈ సమయంలో తాజాగా కృత్రిమ మేథ ఈ పిచ్చిని పీక్‌ స్టేజ్‌కు తీసుకుపోతున్నది. ఆ తొలి అడుగు మెటా నుంచి పడుతున్నది. మెటా ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఇకపై డిజిటల్‌ చాంపియన్స్‌ పేరిట కొత్త ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ చాట్‌బాట్‌లో యూజర్లు అశ్లీల సంభాషణలు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఇంటర్నెట్‌లో రేటెడ్‌ కంటెంట్‌ ఉన్న పేజీలు వయో నిర్ధారణ అడిగి.. 18 ఏళ్లకు పైబడినవారు మాత్రమే చూడాలనే సూచన చేస్తాయి. ఇప్పుడు రాబోయే చాట్‌బాట్‌లలో దీనికి కూడా మంగళం పాడారని తెలుస్తున్నది. చిన్నవయసు వారు సైతం దీనిలో యూజర్లుగా మారే అవకాశం కలుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. మెటా చేస్తున్న ప్రయత్నాలపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సోషల్‌ మీడియా భవిష్యత్తు ఈ చాట్‌బాట్‌లేనని మెటా అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌ భావిస్తున్నట్టు ఆ కథనం పేర్కొన్నది.

అయితే ఈ ఏఐ చాట్‌బాట్‌లను పాపులర్‌ చేసేందుకు మెటా బాస్‌ చూపుతున్న హడావుడి నైతిక పరిమితులను దాటడమేనని వేర్వేరు డిపార్ట్‌మెంట్లలోని మెటా ఉద్యోగులు అనేక మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాంటసీ సె*కు అనువైన ఏఐ పెర్సోనాస్‌ను కంపెనీ ఇప్పటికే సృష్టించిందని ఆ వర్క్‌లో ఇన్‌వాల్వ్‌ అయినవారిని ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొన్నది. వీటికి వాడటానికి వయసు పరమైన నియంత్రణలు కూడా లేవని తెలుస్తున్నది. దీనిద్వారా చిన్నపిల్లలు అభ్యంతరకర కంటెంట్‌కు ప్రభావితులవుతారన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

రొమాంటిక్‌ రోల్‌ ప్లే సహా పూర్తిస్థాయి సోషల్‌ ఇంటరాక్షన్‌లను ఈ ఏఐ ఎంపవర్డ్‌ పెర్సొనాస్‌ అందిస్తాయి. అందుకు తగినట్టుగా వాటిని మెటా రూపొందించింది. టెక్ట్స్‌ మెసేజెస్‌తోపాటు.. సెల్ఫీలు షేర్‌ చేసుకోవడం, వాయిస్‌ చాట్‌ కూడా ఉంటుంది. ఈ ఏఐ పెర్సొనాస్‌కు వాయిస్‌ ఇచ్చేందుకు ప్రముఖ లేడీ సెలెబ్రిటీలు క్రిస్టీన్‌ బెల్‌, జుడీ డెన్చ్‌తోపాటు.. రెజ్లర్‌గా ఉండి.. నటుడిగా మారిన జాన్‌ సెనాతో మెటా ఒప్పందం చేసుకున్నది. ఈ చాట్‌బాట్‌లకు వీరు వాయిస్‌ ఇస్తారు. అయితే.. అశ్లీల సంభాషణలకు వాళ్ల వాయిస్‌లను ఉపయోగించుకోబోమని వారికి మెటా హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

ఇవికూడా చదవండి..

Telangana | CS శాంతికుమారికి కీలక బాధ్యతలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి హవా!
Revanth Reddy | నేను CM అయిన రెండో రోజే.. KCR గుండె పగిలింది! ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో
BRS: శైలికి భిన్నంగా KCR ప్రసంగం.. స్క్రిప్ట్‌తో పస తగ్గిన ఉపన్యాసం

Exit mobile version