Rains | నాలుగు రోజులు తెలంగాణ జిల్లాల్లో వానలు

తెలంగాణలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది

  • Publish Date - July 4, 2024 / 05:00 PM IST

విధాత : తెలంగాణలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం జిల్లాలో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Latest News