ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు ఇవే..!

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్ కాలేజీల‌తో పాటు గురుకుల కాలేజీల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశం పొందేందుకు అడ్మిషన్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విద్యార్థుల‌తో పాటు వారి త‌ల్లిదండ్రుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

  • Publish Date - June 7, 2024 / 10:05 PM IST

హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్ కాలేజీల‌తో పాటు గురుకుల కాలేజీల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశం పొందేందుకు అడ్మిషన్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విద్యార్థుల‌తో పాటు వారి త‌ల్లిదండ్రుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఎందుకంటే గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని. ప్ర‌భుత్వ గుర్తింపు పొంద‌ని కాలేజీల్లో చాలా మంది విద్యార్థులు గ‌తంలో అడ్మిష‌న్లు పొందారు. వార్షిక ప‌రీక్ష‌ల స‌య‌మానికి ఆ కాలేజీకి ప్ర‌భుత్వ గుర్తింపు లేద‌ని తెలుసుకుని, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ల‌బోదిబోమ‌న్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. కాబ‌ట్టి ముందు జాగ్ర‌త్త‌గా ఇంట‌ర్ బోర్డు.. త‌మ అనుమ‌తి పొందిన కాలేజీల జాబితాను ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

2024-25 విద్యా సంవత్స‌రానికి గానూ అనుమ‌తి పొందిన కాలేజీల వివ‌రాల‌ను జిల్లాలు, మండ‌లాల వారిగా పొందుప‌రిచింది. ఎప్ప‌టిక‌ప్పుడు కాలేజీల వివ‌రాల‌ను అప్డేట్ చేస్తామ‌ని, ఈ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచిన కాలేజీల్లో మాత్ర‌మే అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని విద్యార్థుల‌ను ఇంట‌ర్ బోర్డు అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌భుత్వ గుర్తింపు పొంద‌ని కాలేజీల్లో అడ్మిష‌న్లు తీసుకుంటే, వార్షిక ప‌రీక్ష‌లు రాసేందుకు అనుమ‌తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల వివ‌రాల కోసం ఈ లింక్‌ను acadtgbie.cgg.gov.in  క్లిక్ చేయండి.

Latest News