పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఆలోచ‌న లేని రేవంత్‌

రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప..పీపుల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్.. గురించి అలోచన చేయ‌డం లేద‌ని మ‌ల్కాజిగిరి బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్ అన్నారు

  • Publish Date - April 22, 2024 / 06:30 PM IST

మ‌ల్కాజిగిరి బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌

విధాత‌: రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప..పీపుల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్.. గురించి అలోచన చేయ‌డం లేద‌ని మ‌ల్కాజిగిరి బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్ అన్నారు. సోమ‌వారంమల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గలోని వినాయకనగర్ (137వ డివిజన్)లో వాకర్స్ తో సమావేశమైన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇచ్చారన్నారు. ఆగస్ట్ లో రుణమాఫీ అమలు చేస్తా అని రేవంత్ చెప్తున్న మాట‌లు వింటుంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడిగా ఎలా నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.

లిక్కర్ అమ్మితే వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదన్నారు. పెరిగిన పెన్షన్ వల్ల 44 లక్షల మందికి రూ. 23 వేల కోట్లు అవుతుంద‌ని, 2500 రూపాయల చొప్పున కోటిన్నరమందికి రూ. 40 వేల కోట్లు అవుతుందన్నారు. ఇలా ఇచ్చిన హామీలకు లక్ష కోట్లు అవుతుందని. వీటి అమ‌లు ఎలా సాధ్యమో మేధావులు వారు చర్చ పెట్టాలన్నారు. నేను ఊరికే దండం పెట్టె కల్చర్ ఉన్నవాణ్ణి కాదని, సేవచేసే వాడినన్నారు.

ఇందిరాపార్క్ దగ్గర వేసిన ప్రతి టెంట్ కింద నా గొంతుక వినిపించిన వాడిన‌న్నారు. ఎవరు సేవకులు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేది తెలుసుకొని ఓటు వేయించాల‌ని కోరారు. బాజప్తా మోడీగారి దగ్గరికి వెళ్లి పనులు చేయించే సత్తా ఉన్నవాడిని, మల్కాజిగిరి అభివృద్ధి నా భాద్యత అని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బీజేపీ నాయకులు వీకే మహేష్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News