విధాత, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
బోదవాడలో పేలిన బాయిలర్,20మంది కార్మికులకు గాయాలు … సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.

Latest News
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!