Site icon vidhaatha

KTR vs Konda Surekha | కొండా సురేఖ‌కు లీగ‌ల్ నోటీసులు పంపిన కేటీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే ప‌రువు న‌ష్టం దావా వేస్తా..

KTR vs Konda Surekha | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ), రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల అటు రాజ‌కీయ మేధావులు, ఇటు సినీ వ‌ర్గాల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన కొండా సురేఖ‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు( Legal Notice ) పంపించారు.

త‌న‌కు సంబంధ‌మే లేని ఫోన్ ట్యాపింగ్‌( Phone Tapping )పై అస‌త్యాలు మాట్లాడార‌ని కొండా సురేఖ‌పై కేటీఆర్ మండిప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఇత‌ర అంశాల‌పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అస‌త్యాలు. నా గౌర‌వానికి భంగం క‌లిగించాల‌నే ల‌క్ష్యంతో ఆమె అడ్డ‌గోలుగా మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అస‌త్యాలు మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌లు నిజ‌మ‌ని భావించే ప్ర‌మాదం ఉంది. గ‌తంలోనూ ఆమె అడ్డ‌గోలుగా మాట్లాడారు. ఆ వ్యాఖ్య‌ల‌పై ఏప్రిల్‌లోనే నోటీసులు పంపించాను. మంత్రి సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే ప‌రువు న‌ష్టం దావా వేస్తా. దావాతో పాటు క్రిమిన‌ల్ కేసులు( Criminal Case ) కూడా వేస్తాను అని కేటీఆర్ త‌న లీగ‌ల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

Exit mobile version