Site icon vidhaatha

KTR | కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజిది:  కేటీఆర్

విధాత: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజిది.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ చేశారు. గురువారం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ అని తెలిపారు. ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే.. వరప్రదాయినికి ప్రాణం కేసీఆర్ పోశారని ట్విట్ చేశారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించారన్నారు. పటిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలుచేశారని పేర్కిన్నారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారని తెలిపారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదని, దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదన్నారు. కాలమైనా.. కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయన్నారు. కేసిఆర్ కలను సాకారం చేసి ఈ “జలవిజయం”లో భాగస్వాములైన.. నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు.. కష్టపడిన ప్రతిఒక్కరికి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ…జై సీతారామ ప్రాజెక్టు అని ట్విట్ చేశారు.

Exit mobile version