Chicken Shops Close : తెలంగాణలో ఏప్రిల్-1 నుంచి చికెన్ షాపులు బంద్!

తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్ ప్రకటించారు. మార్జిన్ తగ్గింపుపై వ్యాపారుల ఆందోళన మధ్య చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Chicken shops close

విధాత : తెలంగాణలో ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలను ఉప్పల్, ఎల్బీనగర్ సహా జంట నగరాల్లోని పలుచోట్ల చికెన్ వ్యాపారులు ఏర్పాటు చేశారు.

పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించాయని, దీనివల్ల వ్యాపారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. తగ్గించిన మార్జిన్‌ను సరిచేసే వరకు బంద్ ఉంటుందన్నారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం చికెన్ వ్యాపారుల బంద్ టాపిక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర రూ.360 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. వారం క్రితం వరకు స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.260 వరకు ఉండేది. ఒకేసారి ధర పెరగడంతో జనాలు చికెన్ కొనుగోలు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు.

వేసవి కారణంగా ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు పెళ్లిళ్ల సీజన్, ఫంక్షన్ల కారణంగా డిమాండ్ పెరగడం, అదే సమయంలో సరఫరా తగ్గడంతో వంటి కారణాలతో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి తోడు ఇప్పుడు చికెన్ షాపు ల బంద్ నిర్వహణ వాటి ధరలను మరింత ప్రభావితం చేసేదిగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

తెలుగు సింగర్ దుర్గాదేవి స్త్రోతానికి ప్రధాని మోదీ ఫిదా!
gold, silver price increase| పెరిగిన బంగారం, వెండి ధరలు

Latest News