Site icon vidhaatha

CM REVANTH REDDY | గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకం ఎగరేసిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ప్రజాస్వామిక పాలనతో అందరికి సంక్షేమం..అభివృద్ధి
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా విశ్వవేదికపై సగర్వంగా నిలుపుతాం
రైతులకు స్వాతంత్య్రం వేడుక రుణమాఫీ
త్వరలోనే రైతు భరోసా..విద్యాకమిషన్‌
రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనంతో పథకాల అమలులో పురోగమిస్తాం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారత దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు(78th Independence Celebrations) అంగరంగ వైభవంగా సాగాయి. సీఎం రేవంత్‌రెడ్డి గోల్కొండ కోటలో( Golkonda Fort) నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం చేశారు. మహాత్మగాంధీ సాధించిన స్వాతంత్య్ర భారత దేశాన్ని ఆధునిక భారత నిర్మాణం దిశగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు ముందుకు తీసుకెళ్లారన్నారు. నెహ్రు ప్రారంభించిన నాగార్జున సాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టులు, బెల్‌, ఈసీఐఎల్‌, ఐడీపీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో దేశం, రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. ఇందిరా, లాల్‌బహదూర్ శాస్త్రీ, రాజీవ్‌గాంధీల పాలనలో దేశం భూ సంస్కరణలు, హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవంలతో సమగ్రాభివృద్ధి దిశగా సాగిందన్నారు. స్వరాష్ట్రం తెలంగాణ ఇటీవలే దశాబ్ధి వేడుకలు చేసుకుందని, అయితే రాష్ట్రాభివృద్ధి అమరులు ఆశించిన, ఉద్యమ లక్ష్యాల సాధన పదేళ్లలో పక్కదారి పట్టి రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ప్రజల స్వేచ్చ హరించిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏడో గ్యారంటీ స్వేచ్చ పునరుద్ధరణ, ఫ్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని, ప్రజలందరికి సామాజిక న్యాయం , సమానావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా అందేశ్రీ రాసిని జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా(Jayajayahe Telangana song written by Andeshree is the national anthem) ప్రకటించుకోవడంతో పాటు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సంక్షిప్త సంకేతంగా టీఎస్ స్థానంలో టీజీని తెచ్చుకున్నామన్నారు.

రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవన సాధనతో పథకాల అమలు

పదేళ్లలో 75,577కోట్ల అప్పుల నుంచి 7లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా విధ్వంసమైన తెలంగాణ ఆర్ధిక పునరుజ్జీవనం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందుకు విదేశీ పెట్టుబడులతో పాటు ప్రపంచ బ్యాంకు సహకారం, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెలుతు ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే రైతులకు అతిపెద్ద పండుగగా రూ.2 లక్షల వరకూ 31వేలకోట్ల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ తెలంగాణ రైతుల ఆర్థిక స్వాతంత్య్రంంగా అభివర్ణించారు. ధరణి సమస్యలపై మా ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే అర్హులైన రైతులందరికి రైతు భరోసా అందిస్తామని, దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం అధికారులు తయారు చేస్తున్నారని.. పూర్తి ప్రణాళిక సిద్ధం కాగానే రైతు భరోసా(Farmer’s Assurance) అందిస్తామని గోల్కొండ కోట సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో అధికంగా 72,659కోట్లు(agriculture sector has an excess of 72,659 crores in the budget)కేటాయించామని గుర్తు చేశారు. సన్న వడ్లకు 500బోనస్ అందిస్తామని, ఫసల్ బీమా యోజన ద్వారా పంటల బీమా అమలు చేస్తామని, ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

త్వరలోనే విద్యాకమిషన్‌

మాదక ద్రవ్యాల రవాణ, వినియోగంపై ఉక్కు పాదం మోపుతున్నామని, విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు త్వరలో విద్యాకమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అంగన్వాడీలు ఫ్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నమని, ప్రాథమిక పాఠశాలలు మొదలు ఉన్నత విశ్వవిద్యాలయాల వరకు విద్యాబోధన ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని మహింద్రా గ్రూప్ చైర్మన్‌ను దీనికి చైర్మన్‌గా నియమించుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంఆ తీర్చిదిద్ధే క్రమంలో ఫ్యూచర్ స్టేట్‌గా నిలబెట్టేందుకు పూనుకుని, ముచ్చర్ల వైపు ఫోర్త్ సిటీ నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం, మెట్రో విస్తరణ తదితర అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన చేపడుతున్నామని తెలిపారు. ఇటీవలే ఉద్యోగ, ఉపాధి కల్పనల దిశగా విదేశీ పర్యటనలతో 40వేల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. హైదరాబాద్ నిర్మాణ ప్రగతికి హైడ్రా ఏర్పాటు చేశామని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలివ్వడంతో పాటు 11,062టీచర్ల పోస్టులకు భర్తీకి డీఎస్సీ పరీక్షళు నర్విహించామని, గ్రూప్ 1పరీక్ష నిర్వాహణతో పాటు గ్రూప్‌ 2,3నియామకాల దిశగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యల పరిషా్రానికి ప్రయత్నిస్తునే కృష్ణా, గోదావరి జలాల్లో మన వాట సాధనకు కృషి కొనసాగుతుందన్నారు.

రాష్ట్రంలోని మహిళాభివృద్ధికి 63లక్షల మహిళల ఆర్థిక ఉన్నతికి ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) ప్రాంరభించామని, వారికి 1లక్ష కోట్ల ఆర్థిక సహాయంతో పాటు 10లక్షల ఫ్రమాద బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారు చేసే ఉత్పత్తుల అమ్మకాలకు శిల్పారామం వద్ధ డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ప్రభుత్వమని, స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ… సంక్షేమానికి పెద్దపీట వేస్తూ… విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ గోల్కొండ కోట సాక్షిగా హామీ ఇస్తున్నానని, ఈ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

 

 

 

Exit mobile version