రాజ్‌భవన్‌కు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ

విధాత:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి ఎన్వీ రమణ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన […]

  • Publish Date - June 12, 2021 / 01:58 AM IST

విధాత:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి ఎన్వీ రమణ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.