Site icon vidhaatha

లోతట్టు ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక తనిఖీలు

విధాత,హైదరాబాద్: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లో కలిసి అమీర్ పేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. బల్కం పేటలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బుద్ధా నగర్, మైత్రీ వనంలో డ్రైనేజీ సిస్టంను పరిశీలించారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని సీఎం సూచించారు. వెంటనే డ్రైనీజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు.

పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని స్థానికులు సీఎంకు పిర్యాదు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడి సమస్యలను బస్తీవాలసులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామాని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ బాలుడు సీఎంకు అక్కడి వరద సమస్యను సీఎంకు వివరించాడు.

జశ్వంత్ అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడని, తమ ఇంట్లోకి వరద నీరు వచ్చిందని తన పుస్తకాలు అన్నీ తడిచాయని సీఎంకు చెప్పాడు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి బాలుడికి ధైర్యం చెప్పాడు. మరోవైపు వరద ప్రభావంపై హైడ్రా కమిషన్ రంగనాథ్‌ను, ఇతర అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం వారికి సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో తొలగింపు చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్లలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Exit mobile version