Revanth Reddy| సర్పంచులు మనోళ్లు ఉంటే.. మంచి పాలన అందుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

కొత్తగూడెంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

విధాత : కొత్తగూడెం(Kothagudem)లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ(Dr Manmohan Singh Earth Science University)కి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన(Foundation Stone) చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎంఎల్ ఏ లు,ఎంఎల్సీ లు, ఉన్నతాధికారులు పాల్లొన్నారు. అనంతరం యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట‌ అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి ప్ర‌భుత్వానికి అండగా నిల‌బ‌డిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్య‌మానికి ప్రాంతం కొత్త‌గూడెం స్పూర్తినిచ్చిందన్నారు. తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ను నేర‌వేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పేరు ఎర్త్ యూనివ‌ర్సిటీ కి పెట్ట‌డం గొప్ప అవ‌కాశం అని తెలిపారు. తెలంగాణ ప్రాంత వాసుల చిర‌కాల వాంఛ నెర‌వేర్చిన మ‌న్మోహాన్ సింగ్ పేరు యూనివ‌ర్సిటీకి పెట్టామని వెల్లడించారు. విద్య మాత్ర‌మే తెలంగాణ ను ఉన్న‌త‌స్థానంలో నిల‌బెడుతుంది..అందుకే ఆ వైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామన్నారు. సింగ‌రేణి లాంటి సంస్థ‌ల‌ను పెంచాలంటే ఎర్త్ యూనివ‌ర్సిటీ లాంటి వి అవ‌స‌రం ఉందని వ్యాఖ్యానించారు.

క్రిష్ణా, గోదావ‌రి జలాల‌తో ఖ‌మ్మం జిల్లా పొలాల‌ను పారించి సిరులు కురిపించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోందన్నారు. ఖ‌మ్మం జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు 10 యేళ్లు నిర్లక్ష్యానికి గుర‌య్యాయని, గ‌త పాల‌కుల‌కు క‌మిష‌న్లు కురిపించాయి త‌ప్ప నీళ్లు పార‌లేదని విమర్శించారు. ఖ‌మ్మం జిల్లా అభివృద్దికి నిధులు, అనుమ‌తులు మంజూరు చేసే బాధ్య‌త తనదని సీఎం హామినిచ్చారు. రేష‌న్ కార్డుల పంపిణి, స‌న్న‌బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఇందిర‌మ్మ చీర‌లు.. ఏ కార్య‌క్ర‌మైనా ఖ‌మ్మం జిల్లా నుంచే ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు.

ప్ర‌జా పాల‌న‌ను అందించి మంచి పాల‌న అందిస్తున్నామని.. మంచి పాల‌న ఉంటే ఉచిత క‌రెంటు, రేష‌న్ కార్డుల పంపిణి, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఇందిర‌మ్మ చీర‌లు లాంటి వ‌స్తాయని చెప్పుకొచ్చారు. ‘అందుకే గ్రామాల్లో స‌ర్పంచ్ లు మంచోళ్లు ఉండాలి.. మంత్రుల‌తో క‌లిసి ప‌నిచేసే వాళ్లు కావాలి. అభివ‌ృద్ది కోసం మంచి స‌ర్పంచ్ ల‌ను ఎన్నుకోవాలి. గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మానండి.. ప‌దేళ్లు అండాగా నిల‌బ‌డండి. తెలంగాణ‌ను దేశంలో అగ్ర‌గామిగా నిల‌బ‌డ‌దాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Latest News