Congress | డీసీసీలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. లిస్టులో పలువురు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు హైకమాండ్ జాబితాను విడుదల చేసింది. 33జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.

విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు హైకమాండ్ జాబితాను విడుదల చేసింది. 33జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అన్ని జిల్లాలకు అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇందులో పలువురు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం దక్కింది. ఐదుగురు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

డీసీసీలుగా నియమితులైన పలువురి వివరాలు.. ఆదిలాబాద్ – నరేశ్ జాదవ్, అసిఫాబాద్ – ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవి ప్రసన్న, గద్వాల్- ఎం రాజీవ్ రెడ్డి, హన్మకొండ – ఇనగాల వెంకట్ రామిరెడ్డి (కార్పొరేషన్ చైర్మన్), జగిత్యాల -జి.నన్నయ్య, జనగామ- లకత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి – బట్టు కరుణాకర్, ఖైరతాబాద్ – రోహిత్ ముదిరాజ్, మహబూబాబాద్ – భూక్య ఉమా , నిర్మల్ – వెడ్మా బుజు, యాదాద్రి భువనగిరి – బిర్లా ఐలయ్య (ప్రభుత్వ విప్), పెద్దపల్లి – రాజ్ ఠాకూర్, నల్లగొండ – పున్న కైలాస్ నేత, సూర్యాపేట – గుడిపాటి నరసయ్య లను డిసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.

Latest News