Site icon vidhaatha

ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి: డిప్యూటి సీఎం భ‌ట్టి

bhatti

bhatti

 

విధాత‌: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ క్రోధినామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాల‌ను పంచాల‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల్లో సుఖ శాంతులు తేవాల‌ని, క‌ష్టాలు, నష్టాలు తొల‌గి ఆనంద‌మ‌య జీవితాల‌కు ఈ పండుగ నాంధి కావాల‌ని ఆకాంక్షించారు. ఇందిర‌మ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గ్యారంటీల వ‌ల్ల ల‌బ్ధి పొందుతున్న‌ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నిండాల‌న్నారు.

 

ఈ క్రోధినామ సంవ‌త్స‌రంలో స‌మృద్ధిగా వ‌ర్షాలు కురువాల‌ని, పంట‌లు బాగా పండాల‌ని, రైతులు బాగుండాల‌ని, స‌క‌ల వృత్తుల వారు ఆనందంగా ఉండాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసినందున నిరుద్యోగుల‌కు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవ‌త్స‌రం కావాల‌న్నారు.

Exit mobile version