విధాత ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీఆరెస్ నాయకుల మధ్య లుకలుకలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆ పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి రగిలింది. బుధవారం కామారెడ్డికి చెందిన ముఖ్య నాయకులతో హైదరాబాదు ప్రగతి భవన్ లో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశానికి కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు అనుమతి లేకుండా పోయింది. దీంతో ఓ ఫామ్ హౌస్ లో కౌన్సిలర్లంతా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయా కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలతో దాడి చేశారు. వీటన్నింటినీ వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ఈ నేపథ్యంలో పార్టీలో లుకలుకలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.