సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా: ఈటల

సీఎం రేవంత్‌రెడ్డి ఏదో సాధించే పెద్ద సిపాయి అనుకున్నానని, అంతా ఉత్తదేనని తేలిపోయిందని ఆరునెలల్లోనే ప్రజలతో చీ కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు

  • Publish Date - May 23, 2024 / 04:04 PM IST

ఆరు నెలల్లోనే అంతా ఉత్తిదనే తేలిపోయింది
మాజీ మంత్రి ఈటల

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ఏదో సాధించే పెద్ద సిపాయి అనుకున్నానని, అంతా ఉత్తదేనని తేలిపోయిందని ఆరునెలల్లోనే ప్రజలతో చీ కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ధేవరకొండలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆరెస్‌లు రెండు నాణానికి బొమ్మా, బొరుసు లాంటి పార్టీలని విమర్శించారు. పదేళ్ల బీఆరెస్‌ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సర్వేలను తలదన్నేలా ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణ కూడా రాలేదని అన్నారు. 2014, 2019లో ఒక్క హామీ ఇవ్వకుండానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని పోలింగ్‌ సరళీ చాటుతుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు బాటలు వేయాలని కోరారు.

Latest News