Site icon vidhaatha

Fake IAS | భార్యను మోసం చేసి 2 కోట్లు కొట్టేసిన నకిలీ ఐఏఎస్ అరెస్టు

మాట్రిమోనీలో ఫేక్ సర్టిఫికెట్లతో పెళ్లి

విధాత, హైదరాబాద్ : భార్యను మోసం చేసి 2 కోట్లు కొట్టేసిన నకిలీ ఐఏఎస్‌ను మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నల్లమోతు సందీప్‌కుమార్ అనే నిరుద్యోగి తను ఐఏఎస్ క్వాలిఫై అయ్యాయని, ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివానంటూ చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి మాట్రిమోనీ సైట్ ద్వారా ఓ మహిళను 2018లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తనకి ఐఏఎస్ ఇష్టం లేదని.. రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యని నమ్మించాడు. తన లాకర్‌లో 40కోట్లు ఉన్నాయని, ఇన్‌కం టాక్స్ కట్టకపోవడంతో సీజ్ చేశారని, మనం 2కోట్లు కడితే సీజ్ ఎత్తివేస్తారని భార్యను నమ్మించగా తన బంధువుల వద్ధ ఆమె 2కోట్లు సేకరించి సందీప్‌కు ఇవ్వడం జరిగింది.

ఆ తర్వాతా అతడు అందుబాటులో ఉండకపోతుండటంతో పాటు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అతడి వ్యవహారంపై అనుమానంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సందీప్‌కుమార్ ఐఏఎస్ చదవలేదని, అతడివన్ని ఫేక్ సర్టిఫికెట్లని తేలింది. మాట్రిమోనీ సైట్ ద్వారా మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా, అబద్ధాలతో 2కోట్లు కొట్టేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు సందీప్, అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు.

Exit mobile version