Site icon vidhaatha

Former CM KCR  | ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్

Former CM KCR  | మాజీ సీఎం కేసీఆర్ అకస్మా్త్తుగా ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అయితే, సీజనల్ జ్వరంతో మాజీ సీఎం బాధపడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఆస్పత్రికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాం హౌజ్ నుంచి హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి కేసీఆర్ వచ్చారు. తర్వాత వైద్యపరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రికి కేసీఆర్ వెళ్లారు.

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ క్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Exit mobile version