Site icon vidhaatha

ఇంద్రకల్ గ్రామంలో వర్షానికి గోడ కూలి నలుగురు కూలీలు దుర్మరణం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఈదురు గాలులు,భారీ వర్షానికి గోడ కూలి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. కోళ్ల ఫారం నిర్మాణం లో భాగంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ ఈదురు గాలులకు, భారీ వర్షం తోడు కావడం తో ఒక్కసారిగా గోడ కూలింది. అక్కడే పనిచేస్తున్న కొందరు కూలీలపై పడింది. ఈ సంఘటన లో నలుగురు కూలీలు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  గాయపడ్డ వారిని నాగర్ కర్నూల్ ఆసుపత్రి కి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version