భద్రచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ నుంచి వైభంగా నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు
17న సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం
18న సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం
బ్రహోత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు
కళ్యానోత్సవం, పట్టాభిషేకానికి టిక్కట్ల విక్రయం
విధాత: భద్రచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ నుంచి వైభంగా నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహోత్సవాలలో భాగంగా ఈ నెల 17వ తేదీన సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం, 18న స్వామివారి పట్టాభిషేకం వైభంగా నిర్వహించనున్నట్లు దేవాదాయం ధర్మాదాయ శాఖ కమిషనర్ తెలిపారు.
ఈ ఉత్సవాలను వీ-క్షించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా టికెట్లు విక్రయిస్తున్నారు. కళ్యాణోత్సవానికి రూ.7500 (ఉభయ దాతలు) రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 పట్టాభిషేకానికి రూ.1500, రూ.500, రూ.100 సెక్టారు టిక్కెట్లను దేవస్థాన వెబ్ సైట్
https:–//bhadradritemple.telengana.gov.in నందు బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. రూ.10000, రూ.5000 సెక్టార్ టిక్కెట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విక్రయించనున్నట్లు తెలిపారు.
బ్రహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందిస్తారు. భక్తులందరికీ స్వామి తలంబ్రాలు అందజేసేందుకు భద్రాచలం పట్టణంలో ప్రత్యేకంగా 60 కౌంటర్లు ఏర్పాటు చేసి సుమారు 250 క్వింటాళ్ళ తలంబ్రాలు ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. స్వామి లడ్డూ పరసాదం విక్రయించేందుకు 19 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు, 2,50000 లడ్డూలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఉత్సవాలకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపడుతున్నారు.