Heavy Rains | మ‌ళ్లీ ఇవాళ సాయంత్రం భారీ వ‌ర్షం.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

Heavy Rains | మంగ‌ళ‌వారం మాదిరిగానే బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు.

Heavy Rains | హైద‌రాబాద్ : మంగ‌ళ‌వారం మాదిరిగానే బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 43 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 37 నుంచి 40 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇక మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి వ‌ర‌కు రంగారెడ్డి, నల్ల‌గొండ‌, నాగర్‌క‌ర్నూల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, యాదాద్రి భువ‌న‌గిరి, సూర్యాపేట‌, జ‌న‌గామ‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, కొత్త‌గూడెం, హ‌నుమ‌కొండ‌, సిద్దిపేట‌, మెద‌క్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో సాయంత్రం వ‌ర‌కు పొడి వాతావ‌ర‌ణ‌మే కొన‌సాగ‌నుంది. రాత్రికి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది.

భాగ్య‌న‌గ‌రం అత‌లాకుత‌లం

మంగ‌ళ‌వారం సాయంత్రం కురిసిన భారీ వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిప‌డ్డాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ర‌హ‌దారుల‌పై మోకాళ్ల లోతు వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. దీంతో న‌గ‌ర వాసుల‌తో పాటు వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహ‌న‌దారులు అయితే గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

అత్యధికంగా 8.7 సెం.మీ. వర్షపాతం

హైదరాబాద్​లోని బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 8.7 సెం.మీ, విఠల్‌వాడిలో 7.8 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7.8 సెంటీమీటర్లు, విద్యానగర్‌లో 7.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 7.8 సెం.మీ, బహుదూర్‌పురలో 5.7 సెం.మీ, మారేడపల్లి 5.7 సెం.మీ, నాంపల్లిలో 5.5 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌లో 5.5 సెం.మీ వర్షపాతం రికార్డు అయింది. శేరిలింగంపల్లిలో 5.3, కూకట్‌పల్లిలో 5.2 సెం.మీ, అంబర్‌పేటలో 4.7 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

Latest News