విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం జరిగింది. హస్పిటల్‌లో రీనోవేషన్ పనులను చేపట్టారు. అయితే, పనులు చేస్తున్న సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనం లోపల పని చేస్తుండగా సెంట్రింగ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. స్లాబ్ పెచ్చులు ఊడిపడి కార్మికులపై పడడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
