Site icon vidhaatha

Hyderabad : హైదరాబాద్ రోడ్లపై రెచ్చిపోయిన ఆకతాయిలు!

hyderabad-street-goons

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌(Hyderabad) రోడ్లపై ఆకతాయి కుర్రాళ్లు..పోకిరీల వికృత చర్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆకతాయి కుర్రాళ్ల వికృత చేష్టల వీడియో వైరల్ గా మారింది. బైక్‌పై వెలుతున్న ముగ్గురు యువకులు.. స్కూటీపై వెలుతున్న అమ్మాయిలను ఫాలో అవుతూ వేధింపులకు గురి చేశారు. నెమలి ఈకలతో వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఇదంతా వెనుకనుంచి కారులో వెళ్తున్న వాళ్లు వీడియో తీస్తూ ఆ పోకిరీ యువకులను ఏం చేస్తున్నారంటూ నిలదీయడంతో బైక్ వేగం పెంచి పారిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిగా..సదరు పోకిరీలపై చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పోకిరీలతోనే నగర ప్రతిష్ట దెబ్బతింటోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version