Site icon vidhaatha

TS Weather Update | నిప్పులు కురిపిస్తున్న భానుడు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ..!

ts-weather

TS Weather Update  | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాంతో జనం విపరీతమైన ఉక్కపోత, చెటమటతో అల్లాడుతున్నారు. గతవారం రోజుల నుంచి ఎండలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరో వైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడురోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. దానికి తోడు వడగాలులు సైతం వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే రాత్రిళ్లు సాధారణం కంటే అధికంగా వేడి ఉంటుందని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 2న ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని వెల్లడించింది. 3న పొడి వాతావరణ ఏర్పడే అవకాశాలుంటాయని హెచ్చరించింది. ఆదివారం అత్యధికంగా నల్గొండ జిల్లా శివన్నగూడెంలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ పేర్కొంది. ఆ తర్వాత హుజూర్‌నగర్‌లో 43, భద్రాచలంలో 43, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని.. ఏవైనా పనులుంటే ఉదయం.. సాయంత్రం వేళల్లోనే పనులు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎండలతో బయటకు వెళ్లే నేపథ్యంలో వెంట నీటిని తీసుకువెళ్లాలని.. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అలసట, జ్వరం, ఆందోళన, ఊపిరాడకపోవడం తదితర లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

Exit mobile version